తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు ట్యాంక్ బండ్ పై వినాయక నిమాజ్జనానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెళ్లి పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై చేసిన సుందరీకరణ దెబ్బతినకుండా మొదట ట్రయిల్ రన్ ను అధికారులు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ...గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక మైన ఏర్పాట్లను చేస్తున్నామని నగర వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు. అంతే కాకుండా త్వరగా నిమజ్జనం చేసేందుకు ఆటోమేటిక్ ఐడల్ రిలీజ్ సిస్టం ని వాడుతున్నామని సీపీ స్పష్టం చేశారు. మరో ట్యాంక్ బండ్ పై ఈ సారి క్రేన్ల సంఖ్య తగ్గిస్తున్నామని సీపీ వెల్లడించారు. అంతే కాకండా కేవలం పెద్ద విగ్రహాలకు మాత్రమే ట్యాంక్ బండ్ లో నిమర్జనానికి అనుమతిస్తున్నట్టు ప్రకటించారు.