తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ రోజు బండి సంజయ్ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. అంతే కాకుండా ఈ రోజు పర్యటనలో భాగంగా బండి సంజయ్ తో పాటూ బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజశ్వీ జయసూర్య సంగారెడ్డిలో ఏర్పాటు చేయబోతున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా అమిత్ షా కూడా తెలంగాణకు రాబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా అమిత్ షా ఈనెల 17వ తేదీన రాష్ట్రానికి వస్తున్నారని ఎంపీ సోయం బాపూరావు స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సంధర్బంగా నిర్మల్ జిల్లాలోని వెయ్యి ఊడల గ్రామంలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని వెయ్యి ఊడల మర్రి గ్రామంలో హతమార్చారు. దాంతో ఆ గ్రామానికి అదే పేరుగా వచ్చింది.