దిశ చట్టంపై ఏపీ ప్రభుత్వం పై నారా లోకేష్ మరోసారి ఫైర్ అయ్యారు. కన్నబిడ్డలను బలి చేశారు...కన్నోళ్లపై కత్తి దూస్తున్నారంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం కింద 21 రోజుల్లో శిక్ష దేవుడెరుగు..21 రోజుల్లో బెయిల్పై హంతకులు వచ్చేస్తున్నారంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. ఉన్మాదులు బయట తిరుగుతూ కేసులు విత్డ్రా చేసుకోవాలంటూ బాధితుల తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని లోకేష్ ఆరోపించారు. ఉన్మాదుల దాడులలో గాయపడిన వారి చికిత్సకి ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని నారాలోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీ దిశ చట్టం? ఇదేనా మీరు మహిళలకు కల్పించే భద్రత? అంటూ లోకేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ రేపు నరసారావు పేటలో బాధితురాలు అనూషా కుంటుబ సభ్యులను పరామర్శించబోతున్నారు. ఈ పర్యటనకు పోలీసులు పర్మిషన్ లేదని చెప్పడంతో హైటెన్షన్ నెలకొంది.