అసోంలోని బ్రహ్మపుత్రానదిలో జరిగిన పవడ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. బ్రహ్మపుత్రానదిలో నదిలోజరిగిన ప్రమాదం తనను బాధించిందని అన్నారు. ప్రమాదంలో గల్లంతైన వాళ్లంతా క్షేమంగా దక్కాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. గల్లంతైన వారి కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని మోడీ వెల్లడించారు. ఇదిలా ఉంటే నదిలో రెండు పడవలు ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు పడవల్లో ఒక పడవ నీట మునిగిపోయింది. మునిగిపోయిన పడవలో మొత్తం 120 మంది ఉండగా వారిలో 70మంది గల్లంతు కాగా 50మంది బయటపడ్డారు. ఇక పడవలు ఢీ కొనండంతో ప్రయాణీకులు భయాందోళనకు గురై నదిలోకి దూకినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారిలో ఓ మహిళ మృతదేహం లభించింది. మరికొందరి కోసం ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్రానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రయాణీకులంతా గల్లంతయ్యారు.