తీన్మార్ మల్లన్నను సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీకి తరలించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో గతంలో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ పై కేసు నమోదయ్యింది. దాంతో తీన్మార్ మల్లన్నను పోలీసులు కస్టడీకి అప్పగించాలని కోరారు. దాంతో ఒక్కరోజు కస్టడీకి కోర్టు అనుమతులు ఇచ్చింది. దాంతో ఒక్కరోజు తీన్మార్ మల్లన్న ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించనున్నారు. ఇదిలా ఉండగా తీన్మార్ మల్లన్నను ఈనెల గత నెల 27వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ మల్లన్నపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తరవాత కోర్టులో హాజరు పరచగా మల్లన్నకు రిమాండ్ విధించారు. అప్పటి నుండి మల్లన్న చంచల్ గూఢ జైలులో శిక్షణు అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాటం చేస్తున్నందుకే ఆయనపై కక్ష కట్టి అరెస్ట్ చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులు మల్లన్న అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్నారు.