గుంటూరు జిల్లా సత్తెనపల్లి లోని కోడెల విగ్రహావిష్కరణ విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై టీడీపీ అధిష్టానం ఆరాతీసినట్టు సమాచారం. కోడెల సొంత గ్రామం అయిన కండ్లకుంట లో రేపు కోడెల విగ్రహావిష్కరణకు కోడెల శివరాం ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. అంతే కాకుండా కోడెల శివరాం ఇప్పటికే అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ హాజరవుతారంటూ కోడెల శివరాం వర్గం ఆహ్వాన పత్రిక కూడా పంపించారు. అయితే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్లకూడదని అచ్చెన్నాయుడు మరియు ఇతర నేతలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వివాదం పరిష్కారం అయ్యేవరకు వేచి చూడాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే శివరాం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావద్దు అంటూ స్థానిక టీడీపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతో సత్తెన పల్లి పార్టీ లో వివాదం పరిష్కారం అయ్యేలా దృష్టి పెడతానని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అచెన్న హామీ ఇస్తున్నారు.