హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన నింధితుడు రాజు వరంగల్ ఘట్ కేసర్ రైల్య్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు. నింధితుడు రాజు కోసం పోలీసులు దాదాపు ఎనిమిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గాలిస్తుండగా తాజాగా ఈ రోజు ఉదయం నింధితుడి మృత దేహం లభించింది. నింధితుడి ముఖం పై గుర్తు పట్టకుండా గాయాలు ఉండగా చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆదారంగా నింధితుడిని పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ తాజాగా స్పందించారు. కేటీఆర్ నింధితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని మొదట ట్వీట్ చేయగా ఆ తరవాత తప్పుడు సమాచారం అంటూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు అదే ట్వీట్ కు జోడిస్తూ కేటీఆర్ నింధితుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ట్వీట్ చేశారు. ఆ దుర్మార్గుడి మృత దేహం స్టేషన్ ఘన్ పూర్ రైల్య్వే లైన్ పై లభించినట్టు సమాచారం అందిందని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.