ఎన్ని ఘటనలు జరిగినా..నింధితులకు ఎలాంటి శిక్షలు పడ్డా మానవమృగాళ్లలో మార్పు రాదేమో. సైదాబాద్ ఘటన సంచలనంగా మారడం ఆ నింధితుడు పశ్చాత్తాపమో భయమో ఆత్మహత్య చేసుకోవడం జరిపోయింది. అయితే ప్రజలు ఈ దారుణాన్ని మర్చిపోకముందే హైదరాబాద్ లోనే మరో మృగాడు దారుణానికి పాల్పడ్డాడు. మంగల్ ఘట్ లోని హబీబ్ నగర్ లో సుమిత్ అనే మృగాడు తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. సుమిత్ తొమ్మిదేళ్ల చిన్నారిని మిద్దె పైకి తీసుకెళ్లి బలాత్కారానికి యత్నించాడు. అయితే అంతలోనే ఆ బాలిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వాళ్లు వచ్చారు. దాంతో వారిని చూసి సుమిత్ అక్కడ నుండి పారార్ అయ్యాడు. ఈ ఘటన పై బాలిక తల్లి దండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అత్తాపూర్ పోలీసులు నింధితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ నింధితుడిని కూడా కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.