సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కట్టడి రాష్ట్రంలో ఉద్యోగాలు, వినాయకుల నిమజ్జనం సహాపలు అంశాల పై మంత్రివర్గం చర్చించింది. ఇక ఈ సమావేశంలో మంత్రి వర్గం వైన్ షాపుల్లో వివిధ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విధంగా ఈ రిజర్వేషన్ ను కల్పించారు. వైన్స్ లో గౌడ్ మరియు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. అందలో గౌడ కులస్తులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. అంతే కాకుండా వచ్చే యేడాది నుండి ఈ రిజర్వేషన్ లు అమలు కానున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రజల నుండి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే మద్యం కారణంగా నేరాలు ఎక్కువ అవుతుంటే ఇంకా అందులో రిజర్వేషన్ లు కూడా కల్పిస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు.