గత కొద్ది రోజులుగా పంజాబ్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు జరుగుతుండగా రాను రాను పెరుగుతున్నాయి కానీ తగ్గటం లేదు. దాంతో పార్టీ పెద్దలు పలుమార్లు నచ్చజెప్పినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఇక తాజాగా పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం మరింత ముదిరింది. దాంతో ఇవాళ కాంగ్రెస్ శాసనసభ పక్ష అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ మరియు పిసిసి అధ్యక్షుడు సిద్ధూ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తుతున్నాయి. దాంతో ఈ రోజు సీఎల్పీ సమావేశం ఉంటుందని గత రాత్రి 11: 40 నిమిషాల ప్రాంతంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ హరీశ్ రావత్ సమాచారం ఇవ్వడం జరింగింది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ లో ఈ సీఎల్పీ సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశంలో అయినా పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ మరియు పీసీసీ సిద్ధూ మధ్య విభేదాలకు చెక్ పడతాయో చూడాలి.