భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో భర్త ఇంటిముందు మొదటి భార్య నిరసనకు దిగింది. ఈ ఘటన గంగాధర నెల్లూరు మండలం వింజం గ్రాంమంలో చోటు చేసుకుంది. రెండో పెళ్లి చేసుకున్న భర్త హరీష్ ను అరెస్ట్ చేయాలని అతడి భార్య లావణ్య చిన్నారి కూతురు తో కలసి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. లావణ్య చేపట్టిన నిరసన కు దళిత సంఘాలు, మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. లావణ్య ను మోసం చేయడంతో ప్రస్తుతం కోర్టులో కేసు ఉండగా రెండో హరీష్ రెండో పెళ్లి చేసుకున్నాడు. దాంతో అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని తల్లి, బిడ్డకు న్యాయం చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఇక హరీష్ ఫిర్యాదుతో విషయం తెలుసుకుని పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. లావణ్య జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. తన భర్త తనను మొదట పెళ్లి చేసుకున్నాడని..కూతురు పుట్టిన తరవాత విడిచి మరో పెళ్లి చేసుకున్నాడని చెప్పడంతో న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.