ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు అయ్యింది . గుంటూరు జిల్లా కొల్లూరులో ఇద్దరు వ్యక్తులను ఇల్లీగల్ కస్టడీ లోకి తీసుకొని పోలీసులు చిత్రహింసలకు గురిచేసారంటూ పిటిషన్ దాఖలు కావడం కలకలం రేపుతోంది . షేక్ అక్తర్ రోషన్ అనే వ్యక్తి వ్యక్తిని పోలీసులు చిత్ర హింసలు పెట్టారంటూ పిటిషన్ ను దాకలు చేసినట్టు సమాచారం . దాంతో ఇల్లీగల్ కస్టడీపై ధర్మాసనం చాలా సీరియస్ గా స్పందించింది. ఇల్లీగల్ కస్టడీలోకి తీసుకోని చిత్రహింసలకు గురిచేయడం ఏంటని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పు చేస్తే శిక్షించేందుకు న్యాయస్థానాలు ఉన్నాయని కోర్టు పోలీసులకు స్పష్టం చేసింది. ఏడీజీ అధికారితో విచారణ జరిపించి పూర్తి సమాచారం వీలైనంత త్వరగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయవాది రాజారెడ్డి పిటిషనర్ తరుపున వాదనలు వినిపించారు .