ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉదయం అమెరికా పర్యటనకు బయలుదేరనున్నట్టు సమాచారం. ఈ సారి అమెరకా పర్యటనలో భాగంగా ప్రధాని ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ వెంట విదేశీ మంత్రిత్వ శాఖ మరియు జాతీయ భద్రతా మండలితో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికా అధ్యక్షుడు బై డెన్ తో ప్రధాని ముఖాముఖి సమావేశం కానున్నారు. అంతే కాకుండా బైడెన్ అమెరికా ప్రధానిగా ఎన్నికైన తరవాత మోదీ మొదటిసారిగా అమెరికా పర్యటనకు వెళుతున్నారు..గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మోదీ అమెరికా పర్యటనకు వెళ్లి పర్యటించారు. ఇక అమెరికా పర్యటనలో భాగంగా QUAD సమావేశం తో పాటు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇక రేపు అమెరికా అధ్యక్షుడి నేతృత్వంలో జరగనున్న కరోనా ప్రపంచ సదస్సులో కూడా ప్రధాని పాల్గొనభోతున్నారు.