కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తో మరణించివారి కుంటుంబాలకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు అంగీకరించింది. బాధిత కుంటుంబాలకు 50వేల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మొదటగా కేంద్రం ఇచ్చేందుకు నిరాకరించింది. కానీ తాజాగా దీనిపై మరోసారి విచారణ జరగ్గా రూ.50 వేల ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే కేంద్రం ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను రాష్ట్రంలోని డిజాస్టర్ మేనేంజమెంట్ నిధుల ద్వారా పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి భారిన పడి ఎంతో మంది మరణించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా దేశంలో యువతతో పాటు మధ్య వయస్సు గల వారు ముసలి వారు సైతం మరణించారు. అంతే కాకుండా ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కూడా మరణించడం జరిగింది. దాంతో ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండుకుంది.