ఎంతో కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు హీరోలు శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటించిన సినిమా మహాసముద్రం. ఈ సినిమాకు ఆర్ ఎక్స్100 లాంటి సినిమా తీసి హిట్ కొట్టిన అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు అదితి రావ్ హైదరి మరియు అనూ ఇమాన్యుయేల్ నటించారు. అంతే కాకుండా ఈ సినిమాలో కేజీఎఫ్ సినిమాలో నటించిన విలన్ నటించడం విశేషం. ఇక మహాసముద్రం సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేయగా శర్వా, సిద్దార్థ్ ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు. జగపతి బాబు మరియు రావు రమేష్ సినిమాలో నటిస్తుండగా వారికి సంబంధించిన సన్నివేశాలు కూడా ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. అంతే కాకుండా ట్రైలర్ లో శర్వానంద్ రావు రమేష్ బెబుతున్న డైలాగులు హైలెట్ గా నిలిచాయి. అదే విధంగా ట్రైలర్ లో దర్శకుడు అజయ్ భూపతి మార్క్ కనిపిస్తోంది. ఈ సినిమాతో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ సాలిడ్ హిట్ అందుకునే విధంగా ట్రైలర్ కనిపిస్తోంది.