పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్ త్వరలో కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్టు కనిపిస్తోంది. అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరుతున్నారంటూ చాలా వార్తలు వచ్చాయి. అయితే తన అభిమానులతో చర్చల తరవాతే నిర్నయం తీసుకుంటా అని అమరీందర్ చెప్పారు. కాగా తాజాగా ఆయన మంగళవారం సాయంత్రం జేపీ నడ్డా మరయు అమిత్ షా లను కలవబోతున్నారు. అమరీందర్ సింగ్ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం అమిత్ షాను కలవబోతున్నారంటూ రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. అమరీందర్ సింగ్ ను కేంద్ర మంత్రి అథవాలే ఇటీవలే బీజేపీలోకి ఆహ్వానించారు. అంతే కాకండా మీడియా ముకంగా అతన్ని అవమానించిన పార్టీ నుండి అమరీందర్ సింగ్ బయటకు రావాలని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరితే అమరీందర్ సేవలను బీజేపీ వినియోగించుకుంటుందని అథవాలే స్పష్టం చేశారు.