సీఎం జగన్మోహన్ రెడ్డి కి కులపిచ్చి లేదని ఎవరైనా కాదనగలరా..? అంటూ జనసేన నేత పోతిన వెంకట మహేష్ వ్యాఖ్యానించారు. క్రిస్టియన్స్ ను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ నామినేటెడ్ పదవుల్లో వారికి అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. నామినేటెడ్ పదవుల్లో వెయ్యికిపైగా పదవులు వారి సామాజిక వర్గానికి కేటాయించడాన్ని కులపిచ్చి అంటారా లేదంటే సామాజిక న్యాయం అంటారా? అంటూ ప్రశ్నించారు. సామాజిక న్యాయం పేరుతో తన సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.... ఈమధ్య కొంతమందికి అనారోగ్యం వచ్చి ఆపరేషన్ చేయించుకుని మతిస్థిమితం సరిగా లేదు అనుకుంటా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ పోతిన వెంకట మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.