ఇఫ్లూ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో బోధన సిబ్బంది నియామకాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలు వెల్లడించేందుకు ఇఫ్లూ యూనివర్సిటీకి హైకోర్టు అనుమతులు ఇచ్చింది. గత ఏడాది 58 అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఇఫ్లూ నోటిఫికేషన్ విడదుల చేసింది. కాగా ఓబీసీల రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని బీసీ కమిషన్ లో దాసోజు శ్రవణ్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఇఫ్లూ నియామక ప్రక్రియపై గతంలో జాతీయ బీసీ కమిషన్ స్టే ఇచ్చింది. జాతీయ బీసీ కమిషన్ ఉత్తర్వులను ఇఫ్లూ యాజమాన్యం హైకోర్టులో సవాల్ చేసింది. అయితే తాజాగా స్టే ఇచ్చే అధికారం జాతీయ బీసీ కమిషన్ కు లేదని హైకోర్టు వెల్లడించింది. ఓబీసీ రిజర్వేషన్ల వివాదంపై తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఓబీసీ రిజర్వేషన్ల వివాదంపై విచారణ ప్రక్రియ కొనసాగించవచ్చని హైకోర్లు స్పష్టం చేసింది.