ప్రస్తుతం యువత గంజాయి మత్తులో ఊగిపోతున్నారు. పట్టణాలు గ్రామాలు పల్లెలు అని తేడా లేకుండా గంజాయి మత్తులో యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భారీగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నా చర్యలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో గంజాయి సరఫరాకు పోలీసులు అధికారులు కూడా సహకరిస్తూ భారీ మొత్తంలో లంచాలు తీసుకుంటున్నట్టుగా ఆరోపనలు వస్తున్నాయి. ఇక గంజాయి వాడకం పెరటంతో గ్రామాలలో పట్టణాలలో దారుణాలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద గంజాయి గంజాయి పట్టివేత జరిగింది..భారీ మొత్తం లో గంజాయి ని లారీ ట్యాంకర్ లో పెట్టి తరలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు. ఈ తనికీలలో భారీగా గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదే విధంగా గంజాయి తరలిస్తున్న లారీని సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.