హైదరాబాద్ ఫిలింనగర్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మోసపోయిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యం గా వెలుగు చూసిన ఈ ఘటనలో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. అనురాద అనే జూనియర్ ఆర్టిస్ట్ కిరణ్ అనే యువకుడి తో కలిసి కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన కిరణ్ అనురాధకు తెలియకుండా మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. మరో యువతితో ఎంగేజ్మెంట్ కిరణ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు అనురాధకు ఆలస్యంగా తెలిసింది. దాంతో అనురాధ కిరణ్ ల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే..అనురాధ రెండు రోజుల క్రితం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడి మోసం వల్లనే మనస్తాపంతో అనురాధ ఆత్మహత్య చేసుకుందని ఆమె అక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నిందితుడు కిరణ్ పై కేసు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.