జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. జనసేన అనుబంధ విభాగమైన జనసేన మత్స్యకార సంఘం ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ భేటీ ఈ రోజు భేటీ అయ్యారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 217 పై మత్స్యకారుల అభ్యంతరాలపై పవన్ వారితో చర్చిస్తున్నారు. మత్స్యకారులకు నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తోన్న ప్రభుత్వ విధానంపైనే పవన్ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతే కాకుండా రోడ్ల మరమ్మత్తుల తరహాలోనే జీవో 217 కు వ్యతిరేకంగా కూడా పోరాడాల్సిన అవసరం ఉందని మత్స్యకార సంఘ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తూ ఏపీ సర్కార్ పై విమర్శల భాణం ఎక్కుపెడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ పై ఆ పార్టీ మంత్రుల పై పవన్ విమర్శులు కురిపిస్తూ సవాళ్లు విసురుతున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చి తీరతామని పవన్ దీమా వ్యక్తం చేస్తూ అదే విషయాన్ని చెబుతున్నారు.