కృష్ణా జిల్లా గన్నవరం ఆంధ్రా బ్యాంకులో నిన్న భారీ చోరీ జరిగింది. చిన్న పిల్లలతో కలిసి మహిళ చోరికి పాల్పడింది. బ్యాంకులో ఏదో పని ఉన్నట్టుగా వచ్చిన మహిళ గుట్టు చప్పుడు కాకుండా మరో మహిళ వద్ద నుండి డబ్బులు తీసుకుని పారిపోయింది. సీసీ పుటేజ్ ఆధారంగా చోరీకి పాల్పడిన మహిళా ఇద్దరు పిల్లల వివరాలను స్థానిక పోలీసులు సేకరిస్తున్నారించే పనిలో ఉన్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి సదరు మహిళ బ్యాంకుకు వచ్చింది. బ్యాంకుకు వచ్చిన వేరే మహిళ బ్యాగులో 65 వేల రూపాయలు డబ్బును మహిళ మరియు పిల్లలు కలిసి కాజేసినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. చోరీ అనంతరం ఆ మహిళ బ్యాంకు నుంచి పిల్లలతో కలిసి పరారయ్యింది. దాంతో చోరికి పాల్పడిన మహిళపై గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ పురుషోత్తం కేసు నమోదు చేశారు. మహిళ మరియు ఇద్దరు పిల్లల కోసం గన్నవరం పోలీసులు గాలింపులు చేపడుతున్నారు.