విశాఖపట్టణంలో ఓ బాలిక అనుమానస్పదంగా మృతి చెందింది. నిన్న సాయంత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన బాలిక ఈ రోజు ఉదయం శవమై కనిపించింది. విశాఖ అగనంపూడిలో బాలిక అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. విశాఖ శనివాడలోని ఓ అపార్టుమెంట్ వద్ద మంగళవారం రాత్రి సమయంలో ఆ బాలిక అదృశ్యమైంది. ఆ బాలిక ఎక్కడికి వెళ్లిందని కుటుంబ సభ్యులు, స్థానికులు వెతుకడం మొదలు పెట్టారు. అంతలోనే ఓ అపార్టుమెంట్ వద్ద ఆ బాలిక మృతదేహం లభ్యమైంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒక కుటుంబం జీవనోపాధి విశాఖ నగరానికి వలస వచ్చారు. అగనంపూడిలోని ఓ అపార్టుమెంట్లో వాచ్మెన్గా చేరారు. వారికి ఓ 13 ఏళ్ల కుమార్తె ఉంది.