హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. డైరెక్టర్ లకు సంబంధించిన ఇళ్లలో సైతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు మూడు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేపడుతున్నారు. హెటిరో ప్రధాన కార్యాలయంతో పాటు ఆసంస్థకు సంబంధించిన డైరెక్టర్ల ఇండ్లలో సైతం సోదాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయని సాయంత్రం వరకు ఓ కొలిక్కి రానుంది. ఈ సోదాలు మొత్తం 20 బృందాలు పాల్గొన్నాయి. మరోవైపు కరోనాను దృష్టిలో పెట్టుకొని హెటిరో సంస్థ ఓ ఔషదాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం విధితమే. కోవిడ్ 19 కారణంగా ఆస్పత్రిలో చేరిన వయోజనులకు టొసిలిజుమాబ్ అనే ఔషదాన్ని ఎమర్జెన్సీ సమయంలో వినియోగించవచ్చని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చినట్టు హెటిరో ఫార్మా కంపెనీ ఈ మధ్యనే ప్రకటించింది. హైదరాబాద్, జడ్చర్లలోని హెటిరో ఫార్మా సంస్థలలో ఈ ఔషదం లభించనున్నట్టు సమాచారం. సీఈఓకు సంబంధించిన అన్ని కార్యాలయాలలోసైతం సోదాలు నిర్వహిస్తున్నారు.