ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. రాహుల్‌గాంధీ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత కొద్ది రోజుల క్రితం లఖింపూర్‌లో హింసాత్మక ఘటన జరిగిన విషయం విధితమే. లఖింపూర్ బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంకగాంధీని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల హక్కులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కాలరాస్తుందని పేర్కొన్నారు. హింసాకాండకు కారణమైన కేంద్ర మంత్రి కొడుకును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. లఖింపూర్ వెళ్లేందుకు మేము ప్రయత్నిస్తున్నామని వెల్లడించాడు. లఖింపూర్‌లో 144 ఉన్నదని ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మేము ఐదుగురు సభ్యులం వెళ్లాలని అనుకున్నాం. కానీ 144 సెక్షన్ ఉన్న కారణంగా కేవలం ముగ్గురు సభ్యులు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని యూపీ సర్కార్‌ను కోరాడు రాహుల్. బీజేపీ ప్రభుత్వం హథ్రాస్ అత్యాచార ఘటనలో కూడా ఈ విధంగానే వ్యవహరించిందని మండిపడ్డాడు. భారత ప్రధాని నరేంద్రమోడి నిన్న ఉత్తరప్రదేశ్ వెళ్లి కూడా ఇంత హింసకాండ జరుగుతున్న లఖింపూర్‌ను ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.