తెలుగు అకాడమీలో నిధుల స్కాం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా తెలుగు అకాడమీ నిధుల స్కాం కేసులో అకౌంట్స్ చీప్ రమేష్తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిధులను దారి మళ్లిస్తుంటే ఏమి చేస్తున్నారని అకౌంట్ అధికారి రమేష్ పోలీసులు పలు ప్రశ్నలు అడిగారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు రూ.64 కోట్లు కాజేశారు. మొత్తం రూ.324 కోట్లు కొట్టేయాలని పథకం పన్నారని సీసీఎస్ పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వ డిపాజిట్లను కొల్లగొడుతున్నారు. సంక్రాంతి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలోనే డబ్బును డ్రా చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. రమేష్తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేయడంతో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య 10 మందికి చేరుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో నిధులను ముఠా సభ్యులు కొల్లగొట్టారు మూడు బ్యాంకుల్లో కలిపి రూ.64 కోట్లను ఈ ముఠా కాజేసింది. మొత్తం డిసెంబర్ కల్లా రూ.324 కోట్లను కాజేయాలని ముఠా స్కెచ్ వేసింది. కోర్టు అనుమతి మేరకు యూబీఐ బ్యాంకు మేనేజర్ మస్తాన్వలీని పోలీసులు కస్టడిలోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేపట్టనున్నారు.