ఆర్టీసీ రోజు రోజుకు నష్టాల్లో కూరుకుపోతుందని.. ఆర్టీసీని ప్రయివేటు పరం చేస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ఆర్టీసీ చైర్మన్ బాజీరెడ్డి గోవర్థన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం విధితమే. తాజాగా అసెంబ్లీలో బాజీరెడ్డి గోవర్థన్‌రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ ఆదాయం అంతగా రావడం లేదు. ఇతర జిల్లాలతో పోల్చితే ఇక్కడ ఆర్టీసీ నష్టాల్లో ఉంది. కరోనా వచ్చినప్పటి నుంచి ఆర్టీసి నష్టాల్లో కూరుకుపోయింది. గతంలో రోజుకు హైదరాబాద్ సిటీలో రూ.14కోట్ల ఆదాయం వస్తే... ప్రస్తుతం రోజుకు కేవలం రూ.3కోట్లు మాత్రమే వస్తుంది. దాదాపు 11 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లుతుంది. ఆర్టీసీ బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ తనను చైర్మన్‌గా నియమించాడు. ప్రస్తుతం ఉన్న సమస్యలను సీఎం కేసీఆర్ వివరించాడు. మూడు, నాలుగు నెలల్లో ఆర్టీసీ గాడికి పెట్టాలని సూచించినట్టు తెలిపారు. ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు ఏరోజుకు ఆరోజు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన కార్గో సర్వీస్‌లో కొంత మేరకు ఆదాయం వస్తుంది. కార్గో సర్వీస్‌తో లాభాలున్నాయి. ముందు ముందు మరిన్ని సేవలను పునరుద్ధరిస్తాం. కొంత మంది ఆటోలు, కార్లలో ప్రయాణం చేస్తారు.. వాటన్నింకంటే ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని సూచించారు. ఎయిర్‌ఫోర్ట్‌లో ఉన్న సౌకర్యాలను హైదరాబాద్ మహాత్మగాంధీ బస్టాండ్‌లో కల్పిస్తామని గోవర్థన్‌రెడ్డి వెల్లడించారు.