హైదరాబాద్ నగరంలో రిజిస్ట్రేషన్ సమస్య రోజు రోజుకు ఇబ్బందులు తలెత్తతుంది. ఈ అంశంపై ఇవాళ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ జీరో అవర్‌లో తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. సమస్యను గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లాను. రిజిస్ట్రేషన్ల నిర్ణయంపై కాగితం రూపంలో ఇవ్వాలని కోరాను. సమస్య రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది. దీనిని గ్రహించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. హుడా అనుమతి ఉంది. కొన్న తరువాత సమస్యలు తలెత్తుతున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉదాహరణకు వైదేహినగర్, బీఎన్‌రెడ్డినగర్, సాయినగర్, బాలాజీనగర్, సాగర్కాంప్లెక్స్ వంటి తదితర కాలనీలలో వందల ఎకరాల భూమికి మున్సిపాలిటీ అనుమతి ఇచ్చింది. 96 ఓఆర్ఎస్ రద్దు చేసింది. దీంతో రిజిస్ట్రేషన్ బంద్ చేశారు. సెక్షన్ 47, 48 ప్రకారం అనుమతి ఇచ్చింది హుడా. కానీ 22 (ఏ)తో ఇబ్బందులు తలెత్తుతున్నాయయి. సెక్షన్ 47, 48 ఏమి చెబుతుందంటే ఇది క్రయ, విక్రయాలు చేయవచ్చని వివరిస్తుంది. దీనిపై స్పందించి రిజస్ట్రేషన్ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అసెంబ్లీలో కోరారు. ఇది కేవలం ఒక ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తింది. ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది అని వివరించారు.