ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 97,000 సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనం చేకూరేలా ప్రోత్సాహకాలు ఇస్తామని అన్నారు. ప్రోత్సాహకంగా ప్రస్తుతం 450 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ఈ పరిశ్రమలపై ఆధారపడ్డ పది లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. పరిశ్రమలకు ఆదుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు.
గత ప్రభుత్వ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వం క్లియర్ చేస్తుందని అన్నారు. తక్కువ వడ్డీకే రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అన్ని రంగాలను ఆదుకుంటామని అన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమల యజమానుల రాత మారుతోంది. జగన్ నిర్ణయాలతో ఏపీ దశ తిరుగుతుందని చెప్పవచ్చు.