గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతదేహం తారుమారు.... డాక్టర్లపై దాడి... ఆందోళనకు దిగిన వైద్యులు...?
కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం వైద్యులు ఎంతో శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్యులు కరోనా రోగులను కాపాడటానికి కృషి చేస్తున్నారు. కానీ రోగులను కాపాడుతున్న వైద్యులపైనే దాడులు జరుగుతున్నాయి. నిన్న గాంధీ ఆస్పత్రిలో ఒక వ్యక్తి మృతి చెందగా ఆ వ్యక్తి బదులు మరో వ్యక్తి మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది అప్పగించారు. మృతుడి బావమరిది, అది తన బావ మృతదేహమే అని చెప్పడంతో పొరపాటు జరిగిందని సిబ్బంది చెప్పారు.
కానీ మృతదేహాలు తారుమారు కావడంతో ఆగ్రహానికి గురైన మృతుడి కుటుంబ సభ్యులు విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్‌పై అక్కడే ఉన్న ఇనుప కుర్చీ తీసి విసిరారు. దీంతో నిన్న రాత్రి నుంచి జూనియర్ డాక్టర్లు దాడికి దిగారు. జూనియర్ వైద్యుడిపై దాడి ఘటనను గాంధీ వైద్యులు, మెడికోలు తీవ్రంగా ఖండించారు. వైద్యులపై దాడి ఘటనలను ఇకనైనా అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.