ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తోంది. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు కరోనా వల్ల నాడీవ్యవస్థపై ప్రభావం పడుతుందని తేల్చారు. కరోనా వల్ల ఆస్పత్రిలో చేరిన వారిలో దాదాపు సగం మందిలో నాడీ సంబంధ సమస్యలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కరోనా లక్షణాలలో చురుకుదనం లోపించడం, రుచి... వాసన చూడటంతో ఇబ్బందులు, తలనొప్పి, వికారం, పక్షవాతం, కండరాల నొప్పి లాంటి లక్షణాలు ఉన్నాయి.
శాస్త్రవేత్తలు జ్వరం, దగ్గు లక్షణాల కంటే ముందే నాడీ సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తేల్చారు. కరోనా మహమ్మారి వల్ల గుండె, ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రక్తం గడ్డకట్టడం, ఆక్సిజన్ అందకపోవడంలాంటి సమస్యలు ఏర్పడతాయని.... ఈ లక్షణాలు పక్షవాతానికి దారి తీస్తాయని వారు చెబుతున్నారు. కరోనా సోకిన వారిలో శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ స్పందించే తీరు వల్ల మెదడు, నాడులు కూడా దెబ్బ తినవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.