దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ అన్ని రంగాలలో కీలక మార్పులు తెస్తీంది. వైరస్ విజృంభణ వల్ల ఎన్నికల సంఘాలు కొత్త ఆలోచనలు చేస్తున్నాయి. తాజాగా బీహార్ ఎన్నికల సంఘం అక్టోబర్‌-నవంబర్‌ మాసాల్లో బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరపాల్సి ఉండటంతో భారత ఎన్నికల కమిషన్‌కు కొన్ని ప్రతిపాదనలు పంపింది. పోలింగ్‌ బూత్‌లో ఓటరు అడుగు పెట్టిన తర్వాత ఆ వ్యక్తితో భౌతికదూరం పాటించడం కుదరని పని అని బీహార్ ఎన్నికల సంఘం చెబుతోంది. 
 
రిజిస్టర్‌లో ఓటర్‌ సంతకం చేయడమో, వేలిముద్ర వేయడమో పోలింగ్ సిబ్బంది ఓటరుతో కాంటాక్ట్ కావాల్సి వస్తుందని... ఓటర్లందరికీ ఖాదీ గ్లోవ్‌లు ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించమని ఎన్నికల సంఘాన్ని కోరింది. అలాగే ఓటేసేటప్పుడు వేలితో కాకుండా టూత్‌ పిక్స్‌ని ఉపయోగిస్తే బాగుంటుందని సూచనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఏమంటుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: