నెల్లూరు కవలపిల్లల హత్యకేసులో సంచలనాలు.. !

నెల్లూరులో గత నెల జరిగిన కవలపిల్లల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బాపాలు తాగి మృతి చెందిన తర్వాత ఇద్దరు పిల్లలు మరణించిన సంగతి తెలిసిందే. అయితే భార్యభర్తల మధ్య జరుగుతున్న విభేదాల కారణంగానే నిందితులు పిల్లలను పొట్టన పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు భార్యాభర్తలు ముందు నుండి ఒకరి పైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా తండ్రి అయితే మీడియా ముందు తన భార్య పిల్లలను హత్యచేసింది అంటూ ముసలి కన్నీరు కార్చారు. అంతే కాకుండా ఫుడ్ పాయిజన్ కారణంగా పిల్లలు మరణించినట్టు దంపతులు నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీసుల ఎదుట కూడా అలాగే నటించారు. ఇక  ఈ కేసులో తండ్రి హంతకుడు అని తాజాగా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనతో గ్రామస్థులంతా భార్యా భర్తలపై దుమ్మెత్తి పోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: