రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది.. ఈ యుద్ధాన్ని రష్యా ప్రారంభించింది. ఇది కొన్ని రోజులుగా ఊహిస్తున్నదే అయినా.. రష్యా ఇటీవల కాస్త తగ్గినట్టు కనిపించింది. జర్మన్, అమెరికా వంటి దేశాలు ఇచ్చిన ఆంక్షల హెచ్చరికలు పని చేశాయని అందరూ భావించారు. కానీ.. ఇప్పుడు రష్యా దూకుడు ప్రారంభించింది. ఏకంగా ఉక్రెయిన్ పై మిలిటరీ యాక్షన్ తీసుకుంటున్నామని బహిరంగంగా ప్రకటించి మరీ యుద్ధం మొదలు పెట్టింది.


ఉక్రెయిన రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా దాడులు ప్రారంభించింది. రష్యన్ సైన్యాలు ఉక్రెయిన్ సరిహద్దులను దాటి లోపలికి చొచ్చుకుపోతున్నాయి. ఈ మిలటరీ చర్యపై మాట్లాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఎవరైనా జోక్యం చేసుకుంటే విపరీత పరిణామాలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఆయుధాలు వదిలిన ఉక్రెయిన్ సైనికుల జోలికి వెళ్లబోమన్న పుతిన్‌ ... ఆయుధాలు విడిచిపెట్టిన సైనికుల ప్రాణాలకు హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: