ఒంగోలులో 27,28 తేదీల్లో మహానాడు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహానాడు కోసం ఒంగోలులోని మినీ స్టేడియం ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వాన్ని కోరింది. అందుకు తగిన ఫీజు కూడా చెల్లిస్తామని అడిగింది. కానీ.. జగన్ సర్కారు మాత్రం ఈ విషయంలో టీడీపీకి జలక్ ఇచ్చింది. అక్కడ అనుమతించడం కుదరదని చెప్పేసింది.

దీంతో చంద్రబాబు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. మహానాడు నిర్వహణపై కమిటీలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఒంగోలు సమీపంలోని త్రోవగుంట ప్రాంతంలోనే మహానాడు నిర్వహణకు నిర్ణయించారు. ఒంగోలు నగర సమీపం లోని  త్రోవగుంటలో 27,28 తేదీల్లో మహానాడు జరపాలని.. మొదటి రోజు ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగ సభ ఉంటుందని చంద్రబాబు నిర్ణయించారు. అవసరం అయిన ఫీజు చెల్లించినా, ముందుగానే సంప్రదించినా స్టేడియం ఇవ్వడం కుదరదని ప్రభుత్వ అధికారులు చెప్పడంపై తెలుగుదేశం నేతల మండిపడుతున్నారు. దీంతో ఇతర ప్రతిపాదనలు అన్నీ పక్కన పెట్టేసిన చంద్రబాబు త్రోవగుంట లోనే మహానాడు నిర్వహణకు నిర్ణయిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: