కరెంట్ చార్జీలు ఇప్పుడు ఏడాదికో, రెండేళ్లకో పెరుగుతున్నాయి. కానీ.. ఇప్పుడు ఇక కరంట్ చార్జీలు కూడా పెట్రోలు, డీజిల్ రేట్ల మాదిరిగా పెంచుకునే హక్కు ఇక డిస్కంలకు రాబోతోంది. కరెంటు రేటు  నెలకోసారి మార్చుకునే అవకాశాన్ని కేంద్రం డిస్కంలకు ఇస్తోంది. ఖర్చును బట్టి ఛార్జీలు సవరించుకునే స్వేచ్ఛ డిస్కంలకు కేంద్రం ప్రసాదిస్తోంది. ఇంతకాలం ఈఆర్‌సీ ఆదేశాలుంటేనే పెంచుకునే అధికారం డిస్కంలకు ఉండేది.

కానీ.. ఇప్పుడు విద్యుత్‌ చట్ట నియమావళికి సవరణ ముసాయిదా జారీ చేశారు. ఆ బిల్లు ఆగిపోవడంతో దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఉత్తర్వులు జారీ అయితే కొత్త విధానం త్వరలోనే అమల్లోకి రాబోతోందని తెలుస్తోంది. దీనిని బట్టి ఇక విద్యుత్‌ వినియోగానికి యూనిట్‌ వారీగా విధించే ఛార్జీలు నెల నెలా మారే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కొత్త నియమావళిపై ఉత్తర్వులు జారీ అయితే కొద్ది రోజుల్లోనే ఈ కొత్త విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: