జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అని ఎప్పట్నుంచో చెబుతోంది టీడీపీ. బీజేపీతో ఉంటూ.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ప్రయోజనం ఏంటని ఆలోచిస్తుంది జనసేన. ఒక వేళ టీడీపీతో పొత్తుకి ఒప్పుకున్నా...సగం సగం సీట్ల పోటీకి ఒప్పుకోదు. సీఎం పదవి షేరింగ్ కచ్చితంగా అడుగుతుంది జనసేన. సీఎం పదవిని వదులుకోవడానకి పవన్ సిద్ధంగా లేరు.


మరోవైపు ఏపీలో ఉన్న 175 స్థానాలకు కేవలం 140 నియోజకవర్గాల్లోని ఇన్ ఛార్జ్ లను నియమించారు చంద్రబాబు. మిగతా 35 స్థానాలకు ఇన్ ఛార్జ్ లు లేరు. ఈ విషయంపై అధికార వైసీపీ వాదన మరోలా ఉంది. ఆ ప్రాంతాల్లో టీడీపీకి అసలు నేతలు లేనే లేరు అందుకే ఇన్ ఛార్జ్ లను నియమించలేదంటుంది వైసీపీ.


అయితే ఈ 35 స్థానాలను వామపక్షాలు, బీఎస్పీ, జనసేన కోసం టీడీపీ కేటాయిస్తుందని ప్రచారం జరుగుతోంది. కాగా.. లాభాలాభాలు బేరీజు వేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లుంది. అందుకే పొత్తులపై ఎలాంటి అధికార ప్రకటనలు చేయట్లేదు జనసేన.

మరింత సమాచారం తెలుసుకోండి: