ఈ కామర్స్ రంగం లో అమెజాన్, రిలయన్స్ కి పోటీగా రానున్న టాటా గ్రూప్. ఓ "సూపర్ యాప్" తో టాటా గ్రూప్ ఈ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టబోతుంది. నిత్యావసరాలు, దుస్తులు, బంగారం, ఇన్సూరెన్సుల అమ్మకాలు, ఎలక్ట్రానిక్స్ సేవలను ఈ యాప్ లో అందించనుంది. ఈ ఏడాది చివర్లో కాని, 2021 మొదటి రోజుల్లో కాని ఈ "సూపర్ యాప్" మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.