భారత్ లో టీవీల రేట్లు భారీగా పెరగబోతున్నాయి. అక్టోబర్ 1నుంచి కస్టమ్స్ సుంకాన్ని 5 శాతం అమలు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడంతో టీవీల మార్కెట్ పై ఆ ప్రభావం పడుతోంది. దీంతో భారత్ లో ఎల్ఈడీ టీవీల రేట్లు భారీగా పెరగబోతున్నట్టు తెలుస్తోంది. కస్టమ్స్ సుంకం వల్ల దేశీయ తయారీ పరిశ్రమలకు మేలు జరుగుతుందని ఆర్థిక శాఖ అధికారులంటున్నారు.