ప్రముఖ వాలెట్ సంస్థ మొబిక్విక్ తాజాగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌తో జతకట్టింది. ఇందులో భాగంగా కొత్తగా తొలిసారిగా వర్చువల్ ప్రిపెయిడ్ పేమెంట్స్ కార్డను తీసుకువచ్చింది. ఇది క్రెడిట్ కార్డులా పని చేస్తుంది. వాలెట్ సర్వీసుల సంస్థ నుంచి ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ స్థాయికి ఎదగడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా సంస్థ వెల్లడించింది..మొబిక్విక్ బ్లూ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డు యూజర్ వాలెట్‌తో లింక్ అయ్యి ఉంటుంది. కస్టమర్లకు రూ.లక్ష వరకు ఇన్స్టంట్ క్రెడిట్ లభిస్తుంది. దీంతో ఈ డబ్బుతో కస్టమర్లు తమకు నచ్చిన ప్రొడక్టులను కొనుగోలు చేయొచ్చు.. ఇతరత్రా ప్రయోజనాలకి ఈ కార్డులను వాడుకోవచ్చు..