చమురు ఉత్పత్తి స్వచ్ఛంద కోతకు ఇటీవల సౌదీ అరేబియా సిద్ధమైంది.ఈ ప్రభావం చమురు ధరలపై పడబోతోంది. ఇటీవల చమురుని ఉత్పత్తి చేస్తున్న అన్ని దేశాలు సమావేశమైనప్పుడు చమురు ఉత్పత్తి కోతపై నిర్ణయం తీసుకున్నాయి.ఇక ఆ సమయంలో అంచనాల కంటే ఎక్కువగా చమురు ఉత్పత్తి కోతకు సౌదీ అరేబియా సిద్ధమైంది.చివరి సారి జనవరి 6న పెట్రోల్ పైన 26 పైసలు, డీజిల్ పైన 25 పైసలు పెరగగా, ఇప్పుడు జనవరి 13న మరోసారి గణనీయంగా పెట్రోల్,డీజిల్ పై 25 పైసలు పెరిగాయి.