పెన్షనర్లు పీపీఓను ఒక్క క్లిక్‌తోనే ప్రింట్ కూడా తీసుకోవచ్చు అని అధికారులు తెలిపారు.లాక్ డౌన్ సమయంలో పెన్షన్ తీసుకునే వారు పీపీవో గురించి ఆందోళన చెందారు. అయితే ఇకపై ఇపీపీవోలు అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్లోనే పీపీవో పొందొచ్చు. సీనియర్ సిటిజన్స్ నుంచి పీపీఓకు సంబంధించి తరుచుగా పెన్షన్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇలా చేయడం వల్ల ప్రజలకు ఊరట కలుగుతుంది అని ఆయన పేర్కొన్నారు.