ఎస్బీఐ ప్రజల కోసం ఎన్నో సువర్ణ అవకాశాలను కల్పిస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ బ్యాంక్ ఎంతో చేసింది.ఈ బ్యాంక్ సేవలకు మెచ్చి భారీగా కష్టమర్లు పెరుగుతున్నారు.ఇప్పటికే దాదాపు 40 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అంతేకాకుండా దేశంలో ఎక్కువ సంఖ్యలో బ్రాంచ్ లు ఉన్న ఎస్బీఐ భారీ సంఖ్యలో ఏటీఎం సెంటర్లను కలిగి ఉండటంతో పాటు ఏటీఎం సర్వీసులను అందిస్తోంది. అయితే ఏటీఎంల ద్వారా లావాదేవీలను జరిపే వాళ్లు ఏటీఎం ఛార్జీల గురించి కచ్చితంగా అవగాహనను ఏర్పరచుకోవాలి.