ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిల్ టెల్ గురించి తెలియని వాళ్ళు ఉండరేమో.. దేశ వ్యాప్తంగా ఎక్కడైనా , ఎక్కడైనా సరైన నెట్ వర్క్ అంటూ పదే పదే వినపడింది. అదే విధంగా ఎయిర్ టెల్ ఇస్తున్న ఆఫర్లను వినియోగదారులు కూడా ఉపయోగించుకోవడానికి వాడుతున్నారు. ఎయిర్టెల్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3 లో రూ. 854 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో రూ. 1,035 కోట్ల నికర నష్టం ప్రకటించింది. వెరసి ఆరు క్వార్టర్ల తదుపరి టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది.