పౌల్ట్రీ ఫార్మింగ్. అంటే కోళ్ల వ్యాపారం చేయడం. దీని ద్వారా మంచి రాబడి పొందొచ్చు. రిస్క్ కూడా ఉంటుందని భావించండి..రూ.5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు డబ్బులు ఉంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీరు 1500 కోడి పిల్లలు కొనుగోలు చేయాలని భావిస్తే.. ఇంకో 10 శాతం ఎక్కువ పిల్లలను కొనాలి. కోడి పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుంది.కోడి పిల్లలకు రూ.30 నుంచి రూ.35 కావాలి. అంటే కోడి పిల్లలకు మాత్రమే రూ.50 వేలు ఖర్చు అవుతుంది. తర్వాత కోడి పిల్లలకు మేత వేయాలి. అలాగే మందులు కూడా వాడాల్సి రావొచ్చు. 20 వారాలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది.ఇప్పుడు కోళ్లు గుడ్లు పెడతాయి. ఒక కోడి ఏడాదికి 300 గుడ్లు పెడుతుంది. అంటే ఏడాదికి అన్ని కోళ్లు కలిపి 4 లక్షలకు పైన గడ్లు పెడతాయి. ఒక్కో గుడ్డును రూ.5 అమ్మినా కళ్లుచెదిరే లాభం వస్తుంది. రూ.20 లక్షలు పొందొచ్చు.