బంగారం రేటు తగ్గుతుండటంతో.. దానిపై పెట్టుబడి పెట్టేందుకు చాలామంది ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బంగారు బిస్కెట్లతోపాటు, నగలు చేయించుకోడానికి కూడా చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారట. అయితే బంగారం కొనుగోలుకి ఇది అంత మంచి సమయం కాదని, మరికొంతకాలం వాయిదా వేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. బంగారం ధర మరింత తగ్గేవరకు వేచి చూడాలని చెబుతున్నారు.