పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ తీసుకువచ్చింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 లభిస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి. రైతులకు సంవత్సరానికి మూడు విడతల్లో రూ.2 వేలు అందుతాయి.ఇప్పటికే 7 విడతల డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు 8వ విడత డబ్బులు అందించేందుకు రెడీ అవుతోంది. మార్చి నెలలో ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి చేరొచ్చని తెలుస్తోంది. నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి...