పర్సనలైజ్డ్ డేట్, లొకేషన్ తో బయ్యర్ కు లభించే రేర్ మోడల్ గా రోల్స్ రాయ్స్ ఫాంటం టెంపస్ కలెక్షన్ ను కంపెనీ అత్యంత ప్రత్యేకంగా రూపొందించింది. లగ్జరీ కార్ అంటే రోల్స్ రాయ్స్ అనేలా పేరుపడ్డ బ్రాండ్ కార్లతో వచ్చే దర్పం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కార్ డిజైన్స్ లేదా ఫీచర్లు అన్నీ వేటికవే ప్రత్యేకమైనవిగా ఉంటాయి. అందుకే లగ్జరీ కార్ల ఫస్ట్ చాయిస్ గా ఈ కార్లు స్థిరపడిపోయాయి. తరాలు మారినా కొత్త తరం వారు కూడా రోల్స్ రాయ్స్ అంటే ఎంతో ఇష్టపడి మనసు పారేసుకుంటారు...తాజాగా రోల్స్ రాయ్స్ ఫాంటం టెంపస్ పేరుతో స్పెషల్ ఎడిషన్ ను పరిచయం చేస్తోంది ఈ లగ్జరీ బ్రాండ్. ఇది మరింత ఎక్స్ట్రా స్పెషల్, స్పెషల్ థీమ్ తో వస్తున్న మోడల్..కైరోస్ బ్లూ పెయింట్ షేడ్ పై మైకా ఫ్లేక్స్ టచ్ ఉండటంతో అది మరింత తళుక్కుమనే ఎఫెక్ట్ తో కనిపించేలా ఈ స్పెషల్ ఎడిషన్ కార్స్ రూపుదిద్దుకుంటున్నట్టు రిపోర్ట్ లీక్ అయింది.