క్రెడిట్ కార్డును మీ బడ్జెట్ పరిమితులకు అనుగుణంగా వాడుకోవచ్చు. క్రెడిట్ కార్డు కొనుగోళ్ల ద్వారా రివార్డు పాయింట్లను సైతం పొందొచ్చు. క్రెడిట్ కార్డు వాడకాన్ని జాగ్రత్తగా గమనించడం కోసం వారానికి లేదా రెండు వారాలకోసారి మీ క్రెడిట్ కార్డు ఖర్చులను ఆన్లైన్లో పరీక్షించుకోవాలి..క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపేటప్పుడు చాలా మంది ఎక్కువగా ఖర్చు చేసేస్తుంటారు. మీరు కూడా ఇలాగే ఎక్కువ ఖర్చు చేస్తున్నారనుకుంటే.. మీ క్రెడిట్ లిమిట్ తగ్గించాలని క్రెడిట్ కార్డు కంపెనీని కోరవచ్చు. లిమిట్ దాటే వరకు ఉంటే మరో నెల వరకు క్రెడిట్ కార్డు వాడక పోవడమే మంచిది.