హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పది శాతానికి పెంచాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఇన్సూరెన్స్ లో మరిన్ని వ్యాధులను చేర్చాలని హెల్త్ డిపార్ట్మెంట్ కోరిందని తెలుస్తుంది. ఫలితంగా పాలసీల్లో అనేక తీవ్రమైన వ్యాధులను చేర్చాల్సి వస్తోంది. ఎప్పుడూ లాభాల్లో ఉండే కంపెనీలు కరోనా కారణంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.14,000 కోట్ల వరకు ఉన్న కరోనా క్లైమ్స్ ను పరిష్కరించాల్సి ఉంది.